కాంగ్రెస్‌లో పలువురి చేరిక | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో పలువురి చేరిక

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

ఆమనగల్లు: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కడ్తాల్‌ మండల కేంద్రంలో గురువారం జరిగిన కార్యక్రమంలో తలకొండపల్లి గ్రామానికి చెందిన ఉప్పనమోని తిరుపతయ్య, పలువురు నాయకులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి స్వచ్ఛందంగా వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, ప్రభాకర్‌రెడ్డి, అంజయ్యగుప్తా, అజీం, వెంకట్‌రెడ్డి, అజీజ్‌, కృష్ణ, రవీందర్‌యాదవ్‌, రామకృష్ణయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ధర్మన్నగూడ సర్పంచ్‌..

యాచారం: మండల పరిధిలోని ధర్మన్నగూడ సర్పంచ్‌ పండుగ పద్మావతి గురువారం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి తొర్రూర్‌ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామాభివృద్ధి కోసమే తాను బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సర్పంచ్‌ ప్రకటించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గురునాథ్‌రెడ్డి, నాయకులు శ్రీశైలం, వెంకటేశ్వర్లు, బాల్‌రాజ్‌, అంజయ్య, మల్లేష్‌, కృష్ణ, చెన్నయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement