ఆమనగల్లు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతున్నాయని పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని మార్కెట్‌యార్డు ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్నాళ్లు ప్రజల ఓట్లను దోచుకుని రాజకీయాలు చేసిన బీజేపీ ఇప్పుడు రాజ్యసభ సీట్లను కాజేసే స్థాయికి దిగజారిందని విమర్శించారు. బీజేపీ పాలనలో ప్రతిపక్షాల గొంతును నొక్కివేయడం, రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రతను దెబ్బతీయడం పరిపాటిగా మారిందన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక దురదృష్టకర ఘటన అని అభివర్ణించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, పార్టీ మండల అధ్యక్షుడు జగన్, పట్టణ అధ్యక్షుడు మానయ్య, నాయకులు కేశవులు, గూడురు శ్రీనివాస్‌రెడ్డి, కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్


