మాడ్గుల: మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురి ఇళ్ల నిర్మాణాలకు ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ చేయూతనందించారు. బక్కమ్మ, సుజాత, సంజీవ్‌ల ఇంటి నిర్మాణాలకు అవసరమైన సిమెంట్‌ను వెంకటేశ్ సమకూర్చగా గురువారం స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అందించారు. కార్యక్రమంలో నాయకులు గోవింద్, శ్రీధర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే అజిలాపూర్ గ్రామానికి చెందిన కలకొండ యాదమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన స్టీలును ఉప్పల వెంకటేశ్ తరఫున బీఆర్‌ఎస్ నేతలు అందజేశారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన కాలె రుక్కమ్మ అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోగా రూ.1.50 లక్షల ఎల్‌ఓసీ చెక్కు మంజూరైంది. గురువారం బాధితురాలికి ఎల్‌ఓసీ చెక్కును సర్పంచ్ భారతమ్మ అందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జ్యోతి ప్రదీప్‌రెడ్డి, నాయకులు గోపాల్, మహేశ్, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణయ్య, బసవలింగం, మల్లేశ్, రామస్వామి తదితరులు ఉన్నారు.


