మీర్‌పేట: వర్షాకాలంలో ప్రధాన రహదారులపై నీరు నిల్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని బడంగ్‌పేట సర్కిల్ డీఈ హరిణి తెలిపారు. ఎమ్మెల్యే సబితారెడ్డి ఆదేశాల మేరకు గురువారం 58, 60 డివిజన్‌లలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు మాదరి రమేశ్, విజయ్, ట్రాఫిక్, హై డ్రా అధికారులతో కలిసి డీఈ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బాలాపూర్ ఎక్స్‌రోడ్డు, ఆర్‌సీఐ ప్రధాన రహదారి, విశాల్‌మార్ట్ పరిసరాలు, చందన చెరువు, ఎస్‌వైఆర్ కన్వెన్షన్ వద్ద వర్షపునీరు నిలిచే ప్రాంతాలను గుర్తించామన్నారు. వర్షాకాలం దృష్ట్యా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా రహదారులపై నీరు నిల్వకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా హైడ్రా, ట్రాఫిక్ శాఖలను సమ న్వయం చేసుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూ స్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్కిల్ ఏఈ సౌమయ్య, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం, హైడ్రా అధికారి మహ్మద్ జమీల్ ఉన్నారు.


