అబ్దుల్లాపూర్‌మెట్: అమెరికాలోని సెబాన్ నదిలో ముగ్గురిని కాపాడి, ప్రాణాలు కోల్పోయిన అనురూప్‌రెడ్డి మృతదేహానికి మంగళవారం భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి రాసిన సంతాప పత్రాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. మండలంలోని కవాడిపల్లికి చెందిన కోడూరు రాజేందర్‌రెడ్డి, దుర్గాభవాని దంపతుల చిన్న కుమారుడు అనురూప్ రెడ్డి మృతదేహం పది రోజుల తర్వాత స్వగ్రామానికి చేరుకొంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


