మొయినాబాద్: మార్పు అంటే అభివృద్ధిని ధ్వంసం చేయడమేనా అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్ రెవెన్యూలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి పక్కన ఉన్న డంపింగ్ యార్డును మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హిమా యత్‌నగర్ రెవెన్యూలోని ప్రభుత్వ భూమిలో గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనం, వన నర్సరీ ఏర్పాటు చేసిందని తెలిపారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి చెత్తనంతా క్రీడా ప్రాంగణం, పల్లెప్రకృతి వనం, నర్సరీలో వేస్తూ డంపింగ్ యార్డుగా మార్చేశారన్నారు. దుర్వాసన, ఈగలు, దోమలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రోడ్డుపై వెళ్లేవారు ముక్కమూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓవైపు మూసీ ప్రక్షాళన చేపడుతూ గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల పక్కనే చెత్త డంపింగ్ చేయడం ఏమిటని నిలదీశారు. వర్షం పడితే డంపింగ్ యార్డులోని నీరంతా జలాశయాల్లో చేరుతుందన్నారు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తెలి యదా అంటూ ధ్వజమెత్తారు. మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్‌తో ఫోన్‌లో మాట్లాడి నెల రోజుల్లో డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తొ లగించాలని సూచించారు. లేదంటే బీఆర్‌ఎస్ ఆఽ ద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హె చ్చరించారు. ఆమె వెంట బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయ కులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ రవూఫ్, కౌన్సిలర్ శ్రీధర్, మాజీ సర్పంచ్‌లు మంజుల, శ్రీహరియాదవ్, మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మోర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి


