ప్రైవేట్‌ బడుల్లో అధిక ఫీజులు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ బడుల్లో అధిక ఫీజులు

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ పవన్‌ కల్యాణ్‌

మొయినాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయడంతోపాటు పుస్తకా లు, యూనిఫాంలు, ఇతర సామగ్రిని విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నారని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కార్పొరేట్‌ పాఠశాలల్లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం మండల వన రుల కేంద్రంలో విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి.. అధిక ఫీజులు వసూ లు చేస్తున్న విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేసి.. మౌలిక వసతులు కల్పించాలన్నారు. వినతిపత్రం అందజేసినవారిలో సంజయ్‌, చందు, వినయ్‌, చరణ్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement