ఎంపీడీఓ అపర్ణ | - | Sakshi
Sakshi News home page

ఎంపీడీఓ అపర్ణ

Jun 9 2026 9:04 AM | Updated on Jun 9 2026 9:04 AM

ఎంపీడీఓ అపర్ణ

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

షాబాద్‌: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభలు నిర్వహిస్తోందని ఎంపీడీఓ అపర్ణ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని నాగర్‌కుంట గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమాల్లో గ్రామస్తులందరూ భాగస్వాములు కావాలని సూచించారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యంపైప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, జల సంరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఎస్‌ఐఆర్‌పై గ్రామస్తులకు వివరించారు. రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పాలమాకుల మల్లయ్య, ఉపసర్పంచ్‌ బుగ్గ రాములు, పంచాయతీ కార్యదర్శి జగదీశ్‌, వార్డుసభ్యులు, అంగన్‌వాడీ టీచర్‌, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement