మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం
షాద్‌నగర్: పరిసరాలను పరిశుభ్రతతో వ్యాధులు ధరిచేరవని మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 2, 9, 18, 21, 26, 27 వార్డుల్లో వార్డుసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వర్షాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని చెప్పారు. అదేవిధంగా కాలనీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ సునీత, వైస్ చైర్మన్ అందె మోహన్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.


