వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగయ్య
అ‘పూర్వ’ సమ్మేళనం
మొయినాబాద్‌రూరల్: మండల పరిధిలోని అమ్డాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005–06లో పదో తరగతి చదివిన విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో వారందరూ ఒకచోట చేరి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోజంతా సందడి చేశారు.
షాద్‌నగర్‌రూరల్: ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉపాధి కూలీలతో కలిసి ఆయన ఆర్డీఓ సరితకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని, అందులో భాగంగానే జీరామ్‌జీగా పేరు మార్చిందన్నారు. ఉపాధి కూలీలకు ఫొటోల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఫొటో యాప్‌ను రద్దు చేసి, కూలీలకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి రమేశ్‌యాదవ్, మండల అధ్యక్షుడు జంగయ్య, నాయకులు చిన్నచంద్రయ్య, దామోదర్‌రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


