ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్‌నగర్‌రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసర్పంచ్‌లకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో మండల ఉపసర్పంచ్‌ల సంఘం నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. ఉపర్పంచ్‌లకు గౌరవ వేతనం అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌లకు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. గౌరవ వేతనాల విషయాన్ని ప్రభుత్వానికి వివరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో మండల ఉపసర్పంచ్‌ల సంఘం గౌరవ అధ్యక్షుడు ఎర్రోళ్ల అశోక్, అధ్యక్షుడు ప్రకాశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి మహేశ్‌యాదవ్, కార్యనిర్వాహణ అధ్యక్షుడు సయ్యద్‌జావెద్, ఉపాధ్యక్షుడు శ్యామ్‌లాల్, కార్యదర్శులు శివశంకర్, సుమన్‌గౌడ్, ప్రచార కార్యదర్శి రమేశ్, కోశాధికారి గంగాధర్, ప్రధాన సలహాదారుడు నవీన్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.


