ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం

Jun 9 2026 9:04 AM | Updated on Jun 9 2026 9:04 AM

ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి పద్మావతి

మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి పద్మావతి

చేవెళ్ల: ప్రజాసమస్యల పరిష్కారం, వార్డుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికను అమలు చేస్తోందని మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ పద్మావతి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇబ్రహీంపల్లి, రామన్నగూడ, దామరగిద్ద వార్డుల్లో కౌన్సిలర్లు పి.మధుసూదన్‌రెడ్డి, దయాకర్‌, నర్సింలు ఆధ్వర్యంలో వార్డుసభలు నిర్వహించారు. ఈ సభలకు ముఖ్య అతిథులుగా ప్రత్యేకాధికారి పద్మావతి, మున్సిపల్‌ కమిషనర్‌ యాదగిరి, చైర్‌పర్సన్‌ దేవర సమతారెడ్డి, ఎస్‌ఐ శిరీష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో వారు పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు అందించేలా కృషి చేయాలని కౌన్సిలర్లకు సూచించారు. అభివృద్ధి పనుల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సమావేశాల్లో కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, ప్రజలు నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement