ఇంకుడు గుంతలతో భూగర్భజలాలు పెంపు | - | Sakshi
Sakshi News home page

ఇంకుడు గుంతలతో భూగర్భజలాలు పెంపు

Jun 9 2026 9:04 AM | Updated on Jun 9 2026 9:04 AM

ఇంకుడు గుంతలతో భూగర్భజలాలు పెంపు ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌

ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌

శంకర్‌పల్లి: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని, తద్వారా భూగర్భజలాలు పెరుగుతాయని ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మండలంలోని కొండకల్‌లో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. అవసరం ఉన్నా, లేకున్నా నీటి వినియోగం పెరిగిందని, అందుకు అనుగుణంగానే భూగర్భ జలవనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అదేవిధంగా గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త ఆటోల్లో వేయాలని, ఎల్లప్పుడూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రభుత్వం సూచించిన రోడ్డు భద్రత నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని చేవెళ్ల ట్రాఫిక్‌ సీఐ సతీశ్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మోకిల సీఐ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ శేఖర్‌, ఉపసర్పంచ్‌ సీతారాంరెడ్డి, ఎస్‌ఐ సాయికృష్ణ, ఏపీఓ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement