మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్‌కుమార్
శంకర్‌పల్లి: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్‌కుమార్, కమిషనర్ యోగేశ్ అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 1, 9, 10వ వార్డుల్లో వార్డుసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టే వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి సరఫరా, తడి, పొడి చెత్త సేకరణ, మురుగు నీటి కాలువల శుభ్రత తదితర అంశాలపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, గణేశ్, ఆనంద్, వసంత, పీఏసీఎస్ డైరెక్టర్ మహేందర్‌రెడ్డి, మున్సిపల్ మేనేజర్ అంజన్ కుమార్, నాయకులు చంద్రమౌళి పాల్గొన్నారు.


