నందిగామ సీఐ ప్రసాద్
షాద్‌నగర్: ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించి, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని నందిగామ సీఐ ప్రసాద్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని చేగూరులో సర్పంచ్ మంకాల శ్రీశైలం అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ సైదులు, సీఐ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కారు నడిపేవారు సీట్‌బెల్టు, ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. అతివేగం ప్రమాదకరమన్నారు. తహసీల్దార్ సైదులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తోందని, దశలవారీగా పనులు చేపట్టాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.


