కందుకూరు: దొంగ ఓట్లను తొలగించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గం బీఎల్‌ఏ–1 అంబోజి శ్రీనివాస్ మాట్లాడారు. మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పహాడీషరీఫ్, షహీన్‌నగర్, జల్‌పల్లి డివిజన్‌లలో కుప్పలు తెప్పలుగా దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. రోహింగ్యాల ఓట్లను సైతం గుర్తించామని, కేవలం 26 బూత్‌లలోనే 9,960 దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. ఈ నెల 25న ప్రారంభం కానున్న ఎస్‌ఐఆర్‌లో భాగంగా అనుమానాస్పద ఓట్లపై పూర్తిస్థాయిలో బీఎల్‌ఓల సహకారంతో విచారణ జరిపించి, దొంగ ఓట్లను తొలగించాలని కోరారు. అందుకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ సాధ మల్లారెడ్డి, నాయకులు ముఖేశ్‌ముదిరాజ్, రావుల మల్లేశ్ పాల్గొన్నారు.


