రైతుబజార్‌లో కూరగాయల ధరలు | - | Sakshi
Sakshi News home page

రైతుబజార్‌లో కూరగాయల ధరలు

Jun 9 2026 9:04 AM | Updated on Jun 9 2026 9:04 AM

హుడాకాంప్లెక్స్‌: సరూర్‌నగర్‌లోని రైతుబజార్‌లో కూరగాయల ధరలు(కిలో.. రూపాయల్లో).. టమాటా 43, వంకాయ 23, బెండకాయ 37, పచ్చిమిర్చి 40, కాకర 43, బీర 35, కాలిఫ్లవర్‌ 18, క్యాబేజీ 18, క్యారెట్‌ 40, దొండ 41, ఆలు 17, ఉల్లిగడ్డ 22, గోకర 33, దోసకాయ 18, సోరకాయ 13, పొట్లకాయ 18, చిక్కుడు 55, చామ 28, బీట్‌రూట్‌ 25, కీర 35, ఫ్రెంచ్‌బీన్స్‌ 75, క్యాప్సికం 65.

బీజేపీ దళిత మోర్చా మండల కార్యవర్గం ఎన్నిక

మహేశ్వరం: బీజేపీ దళిత మోర్చా మండల నూతన కార్యవర్గాన్ని పార్టీ మండల అధ్యక్షుడు యాదిశ్‌ ఆదేశానుసారం దళిత మోర్చా అధ్యక్షుడు గొల్లూరు మాధవ్‌ సోమవారం ప్రకటించారు. ఉపాధ్యాక్షులుగా జెన్నపల్లి రాజు, గజ్జెల శ్రీనివాస్‌, బొమ్మనబోయిన జంగయ్య, గట్టగళ్ల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శులుగా దాసరి సుదర్శన్‌, రంగుల రవి, కార్యదర్శులుగా ఎర్ర ప్రశాంత్‌, నత్తి జంగయ్య, బండి మోహన్‌రాజు, తొంట శివలింగం, కోశాధికారులుగా బండి ప్రవీణ్‌, జెన్నపల్లి రమేశ్‌, కార్యవర్గ సభ్యులుగా ఏర్పుల ప్రశాంత్‌, కల్వకోల్‌ యాదగిరి, మంత్రి శ్రీకాంత్‌, కొండని సురేష్‌, మంద యాదగిరిని నియమించారు. మండలంలోని ప్రతి గ్రామంలో బీజేపీ బలోపేతం కోసం కృషి చేయాలని, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంపై పోరాడాలని గొల్లూరు మాధవ్‌ సూచించారు.

మృగశిర కార్తె సందడి

కందుకూరు: వానాకాలానికి స్వాగతం పలికే మృగశిర కార్తె రోజు చేపలు ఆరగించడం ఆనవాయితీ. దీంతో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో చేపల విక్రయాలు జోరందుకున్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు కిలో రూ.200 పైగా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. శాఖాహార ప్రియులు బెల్లం, ఇంగువ తినడంతో పాటు అడవుల్లో, పొలాల్లో దొరికే ఆదొండ కాయలతో ప్రత్యేకంగా కూర చేసుకోవడం ఆనవాయితీ.

బహిరంగ సభను విజయవంతం చేయండి

కందుకూరు: ఫ్యూచర్‌ సిటీలో ఈ నెల 10న సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఫ్యూచర్‌ సిటీని రద్దు చేసి ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నారని, వాటిని తిప్పికొట్టేలా ప్రతి గ్రామం నుంచి పెద్దఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావాలన్నారు. ఈ ప్రాంత భవిష్యత్‌ అంతా ఫ్యూచర్‌ సిటీపైనే ఆధారపడి ఉందన్నారు. ఆ రోజు సాయంత్రం సీఎం చేతుల మీదుగా ఎఫ్‌సీడీఏ భవనం, స్కిల్స్‌ యూనివర్సిటీ భవనాలను ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

వనస్థలిపురం పోస్టాఫీస్‌లో ఆధార్‌ సేవలు

వనస్థలిపురం: వనస్థలిపురం సర్కిల్‌ పరిధిలోని పోస్టాఫీసులో ఆధార్‌ నమోదు కేంద్రాన్ని సబ్‌ పోస్ట్‌మాస్టర్‌ దుర్‌ాగ్య నాయక్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు ఆధార్‌ సేవలను మరింత సులభంగా అందించాలనే ఉద్దేశంతో పోస్టాఫీసులో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఈ ఆధార్‌ కేంద్రం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తుందన్నారు. కొత్తగా ఆధార్‌ నమోదు చేసుకునేవారు, పేరు, చిరునామా, మొబైల్‌ నెంబర్‌, జనన తేదీ తదితర వివరాలను సవరించుకునేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత మెరుగైన పోస్టల్‌ సేవలు అందించడానికి పోస్టల్‌ శాఖ కట్టుబడి ఉందని అన్నారు.

ఎంపీ ఈటల రాజేందర్‌కు అభినందన

నాగోలు: ఈటల రాజేందర్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ సభ్యుడిగా విజయం సాధించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం బీజేపీ ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ డివిజన్ల అధ్యక్షులు కలిసి ఆయనకు జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజాసేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బీజేపీ నాగోలు డివిజన్‌ అధ్యక్షులు పంగా శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement