హుడాకాంప్లెక్స్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా ఈ నెల 10న ఎఫ్‌సీడీఏ భవనం, స్కిల్ యూనివర్సిటీ భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్‌ఆర్ పిలుపునిచ్చారు. సోమవారం కొత్తపేటలోని ఓ హోటల్‌లో రామకృష్ణాపురం, ఎన్టీఆర్‌నగర్, సరూర్‌నగర్, డాక్టర్స్‌కాలనీ డివిజన్‌లముఖ్య నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం నుంచి కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ మేరకు నాయకులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోయిని మహేందర్‌యాదవ్, నాయకులు శంకర్‌యాదవ్, గణేశ్‌నేత, ముప్పిడి లింగస్వామి గౌడ్, దయాకర్‌రెడ్డి, రామకృష్ణగౌడ్, బొడ్డుపల్లి మహేందర్, యాదవరెడ్డి, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నేతల మాటలు నమ్మొద్దు
బడంగ్‌పేట్: తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడడం సరికాదని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కిచ్చెనగారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మల్లాపూర్‌లోని వైఏఆర్ గార్డెన్‌లో మీర్‌పేట్, నందిహిల్స్, జిల్లెలగూడ, బడంగ్‌పేట్, నాదర్‌గుల్, బాలాపూర్ డివిజన్‌ల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేఎల్‌ఆర్ మాట్లాడుతూ.. ఈ నెల 10న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ), స్కిల్ యూనివర్సిటీ భవనాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచ్చేసి ప్రారంభిస్తారన్నారు. ప్రపంచస్థాయి దిగ్గజస్థాయి నమ్మకం కలిగేలా ఫ్యూచర్ సిటీని నిర్మించి అభివృద్ధి చేస్తామన్నారు. కాలుష్యం లేని మహానగరంగా మార్చేందుకు గ్రీన్ ఫార్మా, పర్యావరణహితమైన సంస్థలకే అనుమతులు ఇస్తున్నట్లు కేఎల్‌ఆర్ తెలిపారు. సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, బోయపల్లి రాఘవేందర్‌డ్డి, మార్కెట్ డైరెక్టర్ గోవర్ధన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ సుదర్శన్‌రెడ్డి, సామిడి గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్


