కుసుమ పంట కొనుగోలు సంతోషకరం | - | Sakshi
Sakshi News home page

కుసుమ పంట కొనుగోలు సంతోషకరం

Jun 9 2026 9:04 AM | Updated on Jun 9 2026 9:04 AM

కందుకూరు: కుసుమ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం సంతోషకరమని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ కార్యాలయం వద్ద కుసుమ పంట కొనుగోలు కేంద్రాన్ని ఆయన పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. రైతులు ఆయనను సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. నేదునూరు రైతులు కుసుమ పంట కొనుగోలు సమస్యపై తన వద్దకు రాగా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. రైతుల సమస్యను గుర్తించిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని కొనియాడారు. రైతుల విషయంలో రాజకీయాలు చేయకూడదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తేరటి లక్ష్మణ్‌ముదిరాజ్‌, కిసాన్‌ మోర్చా రాష్ట్ర నాయకుడు పల్లె కృష్ణగౌడ్‌, మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి, ఓబీసీ మోర్చా నాయకులు సోమరాజు వెంకటేశ్‌, గంగుల కృష్ణారెడ్డి, గంగుల వెంకట్‌రెడ్డి, సురసాని భూమిరెడ్డి, మైసయ్య, వరుణ్‌, నర్సింహ, నవీన్‌ పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement