బడంగ్‌పేట్: కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఏఐసీసీ కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం బడంగ్‌పేట్ సర్కిల్–16లోని నాదర్‌గుల్ డివిజన్ అల్మాస్‌గూడ శేషాద్రినగర్‌కాలనీలో కాలనీ అధ్యక్షుడు సోమయ్యతో కలిసి నాయకులు రాఘవేందర్‌రెడ్డి, నవారు మల్లారెడ్డి సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీసీరోడ్ల నిర్మాణానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్‌ఆర్ సహకారంతో జనరల్ ఫండ్ కింద రూ.87 లక్షలు మంజూరయ్యాయన్నారు. కాంగ్రెస్‌తోనే గ్రామాలు, పట్టణాల అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు దిండు శ్రీనివాస్‌గౌడ్, కాలనీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, కాలనీవాసులు శంకర్, రాకేష్, శంకర్, లక్ష్మీకాంత్‌రెడ్డి, జగత్‌రెడ్డి, మహేష్, వెంకటేష్‌గుప్త, చంద్ర శేఖర్ తదితరులున్నారు.
ఏఐసీసీ కో–ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్‌రెడ్డి


