నాగోలు: కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్, వంట గ్యాస్ ధరలను నిరంతరం పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని, అధిక ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇ.టి నరసింహ తెలిపారు. సీపీఐ నాగోలు డివిజన్ సాయి నగర్ (గుడిసెలు) ప్రాంత జనరల్ బాడీ సమావేశం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కాంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నర్సింహ మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీల ప్రయోజనాలే లక్ష్యంగా పెట్రో ధరలు పెంచాయన్నారు. తద్వారా దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం అయిందని అన్నారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్ మాట్లాడుతూ... ముందుగా నాగోలు చౌరస్తా నుంచి సీపీఐ కార్యకర్తలు జెండాలు చేతపట్టుకుని సాయినగర్ సీపీఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నాగోలు డివిజన్, సాయినగర్ ఏరియా శాఖల కార్యదర్శులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ


