పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన మనోజ్ కుమార్, సునీతాదేవి(30) దంపతులు పిల్లలతో కలిసి నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం జల్‌పల్లి శ్రీరామ కాలనీకి వలస వచ్చారు. రోజు మాదిరిగానే కుటుంబం నిద్రించగా 1వ తేదీన ఉదయం నిద్ర లేచి చూడగా సునీత కనిపించలేదు. ఎనిమిది నెలల క్రితం నితిన్ అనే వ్యక్తితో వెళ్లిపోయిన సునీత తిరిగి వచ్చిందని, ఇప్పుడు కూడా అతనితోనే వెళ్లిపోయి ఉంటుందని ఆమె భర్త పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మొయినాబాద్‌లో
షూటింగ్ సందడి
మొయినాబాద్: మొయినాబాద్ ప్రాంతం షూటింగ్ స్పాట్‌గా మారింది. నగరానికి చేరువలో ఉండడంతోపాటు ఇక్కడ ఫాంహౌస్‌లు, దేవాలయాలు ఉండటంతో నిత్యం షూటింగ్ లు జరుగుతున్నాయి. ప్రధానంగా టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్ షూటింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. శనివారం కనకమామిడిలోని వేంకటేశ్వర దేవాలయం వద్ద ‘రుణానుబంధం’ సీరియల్ షూటింగ్ జరిగింది. ఆలయానికి వెళ్తున్నట్లు, ఆలయ పరిసరా ల్లో తిరుగుతున్న సన్నివేశాలను చిత్రీకరించా రు. సీరియల్ షూటింగ్‌ను ఆలయానికి వచ్చి న భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు.


