ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

Jun 7 2026 9:12 AM | Updated on Jun 7 2026 9:12 AM

మహేశ్వరం ట్రాఫిక్‌ ఏసీపీ చంద్రశేఖర్‌

మొయినాబాద్‌రూరల్‌: ట్రాఫిక్‌ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని మహేశ్వరం ట్రాఫిక్‌ ఏసీపీ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని కాశీంబౌలిలో నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. సర్పంచ్‌ మాడి రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రాఫిక్‌ ఏసీపీ మాట్లాడుతూ.. మద్యం తాగి డ్రైవింగ్‌ చేయొద్దన్నారు. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరుగుతాయన్నారు. ట్రాఫిక్‌ నియయాలు పాటించాలని సూచించారు. అనంతరం ఎంపీఓ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇళ్లల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయవద్దన్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యం ఉంటుందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ట్రాఫిక్‌ సీఐ సతీష్‌, ఎస్సై శివరాణి, వార్డు సభ్యురాలు స్వాతివిజయేందర్‌రెడ్డి, గ్రామస్తులు భూపాల్‌రెడ్డి, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు కల్పన తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement