షార్ట్‌ సర్క్యూట్‌తో షాపులో మంటలు | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో షాపులో మంటలు

Jun 7 2026 9:12 AM | Updated on Jun 7 2026 9:12 AM

మొయినాబాద్‌: షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ బట్టల షాపులో మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటన మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో జరిగింది. స్థానికంగా ఉండే అనురాధ తన ఇంట్లోనే బట్టల షాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి షార్ట్‌ సర్క్యూట్‌తో అకస్మాత్తుగా మంటలు అంటుకొని భారీగా పొగలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బకెట్లతో నీళ్లు పోశారు. ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చింది. స్థానికులు, ఫైర్‌ సిబ్బంది కష్టపడి పూర్తిగా మంటలు ఆర్పేశారు. అప్పటికే చాలా బట్టలు కాలిపోయాయి. సుమారు రూ.4 లక్షల వరకు నష్టం జరిగినట్లు బాధితురాలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement