‘ ఆ సభకు వెన్నుపోటు సభ అని పెట్టాల్సింది’ | YSRCP MLC Varudu Kalyani Takes On Chandrababu Naidu Over Unfulfilled Welfare Schemes And Women’s Benefits Promises | Sakshi
Sakshi News home page

‘ ఆ సభకు వెన్నుపోటు సభ అని పెట్టాల్సింది’

Jun 13 2026 6:46 PM | Updated on Jun 13 2026 7:47 PM

YSRCP MLC Varudu Kalyani Takes On Chandrababu Naidu

విశాఖ: ఏపీలోని రెండు కోట్ల మంది మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మంది మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ పథకానికి తూట్లు పొడిచారన్నారు. తిరుపతి సభకు వెన్నుపోటు సభ అని పేరు పెడితే బాగుండేదని వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. 

‘తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టారు..నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. సీబీఎన్‌ అంటే చీటింగ్ బోగస్‌ నాయుడు. దైర్యం ఉంటే ప్రజలు ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ అమలు చేశామని చెప్పాలి. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. లోకేష్ నీ గల్లా పట్టుకొని నిలదీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాపు మహిళలను పవన్ మోసం చేశారు.సూపర్ సిక్స్ అమలు చేసే వరకు పోరాటం చేస్తాం’ అని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement