పవన్‌ కల్యాణ్‌కు కొడాలి నాని కౌంటర్‌

Kodali Nani Counter Pawan Kalyan Statements At Gudivada - Sakshi

సాక్షి, గుడివాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. మాటకు మాట కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. తన నియోజకవర్గం గుడ్లవల్లేరులో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘రాష్ట్రం నడి బొడ్డున విజయవాడ, గుంటూరు, భీమవరం, గుడివాడ ప్రాంతాలలో పెద్ద పేకాట క్లబ్‌లు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు, అయన పార్టనర్ పవన్ కల్యాణ్‌ది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన‌ తరువాత రాష్ట్రంలో పేకాట క్లబ్‌లు పెట్టమా.. లేక మూసివేశామో రాష్ట్ర ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పేకట క్లబ్‌లు పెట్టినప్పుడు ఆయన‌ పార్టనర్ ఎక్కడ వున్నాడు. ఎవరో ఇచ్చిన ప్యాకేజిలు తీసుకుని నోటి కోచ్చినట్లు మాట్లాడితే మంచిది కాదు. మేము కాదు నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది’ అంటూ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. (చదవండి: ‘అప్పుడు గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా?)

‘గతంలో పవన్ కల్యాణే జగన్‌మోహన్‌రెడ్డి బాగా పరిపాలిస్తే రాజకీయాలు వదిలి సినిమాలు చేసుకుంటాను అని అన్నాడు. నువ్వు సినిమాలు చేసుకుంటే మాకేందుకు.. చేసుకోకపోతే మాకేందుకు. నిన్ను సినిమాలు మానేయ్యమని మేము అడగలేదు కదా. మేము ఇప్పుటికి నిన్ను ఒక సినిమా యాక్టర్‌గానే చూస్తున్నాం. నువ్వు సినిమాలు వదులుతావా లేక ఇంకా ఎవరినైనా వదులుతావా అని మేం అడగలేదు. ఏం వదలాలి అనేది నీ ఇష్టం. ప్యాకేజీ వచ్చినట్లు ఉంది.. బయటకు వచ్చి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని ఒక వైపు.. సొంత పుత్రుడుని ఓ వైపు జిల్లాలోకి నిన్న పంపించాడు. జోగిజోగి రాసుకుంటే బుడిద వస్తుంది అంటారు. అదే వచ్చింది’ అంటూ నాని ఎద్దేవా చేశారు.

‘ఏ మతమైన మాకు గౌరవం. పవన్ కల్యాణ్‌ ముక్కోటి లింగాలలో బోడి లింగం అని అంటున్నాడు. శివ లింగాలని బోడి లింగంగా సంబోధించడం ఆయన సంస్కారినికి అద్దం పడుతుంది. రాజకీయ పార్టీలు పెట్టి వ్యాపారం చేసుకుని డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసిన వ్యక్తులు వాళ్ళు. ఇలాంటి రాజకీయ పార్టీలు చాలా వచ్చాయి.. కాలగర్భంలో కలిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ప్యాకేజీ తీసుకుని ఇప్పుడు బయటకు వచ్చి వకిల్ సాబ్ చెప్పాడు అని చెప్పామంటున్నావ్. నిన్ను నువ్వు వకీల్ సాబ్ అని అనుకుంటుంటే జనం మాత్రం షకీలా సాబ్‌గా భావిస్తున్నారని తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో పార్టీలు పెట్టి రెండు చోట్ల ఓడిపోయిన అధ్యక్షులు ప్యాకేజీకి మాత్రమే పనికి వస్తారు’ అంటూ నాని మండి పడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top