‘ఇస్రో’ సందర్శన | - | Sakshi
Sakshi News home page

‘ఇస్రో’ సందర్శన

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

గోదావరిఖనిటౌన్‌: అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్‌ నిర్వహించిన ప్రపంచస్థాయి భగవద్గీత వ్యాల్యూ ఎడ్యుకేషన్‌ కాంటెస్ట్‌లో విశేష ప్రతిభ కనబరిచిన స్థానిక తిలక్‌నగర్‌కు చెందిన రాకం శ్వేత – కిరణ్‌ దంపతుల కుమారుడు రిశ్విక్‌ శుక్రవారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)ను సందర్శించాడు. ఈ సందర్భంగా ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథన్‌ రిశ్విక్‌కు నేషనల్‌ టాపర్‌ మెడల్‌తోపాటు జ్ఞాపిక అందజేసి సత్కరించారు.

ఆయిల్‌పామ్‌ తోట పరిశీలన

కాల్వశ్రీరాంపూర్‌: ఉద్యాన అధికారి రాము శనివారం పందిల్ల, ఆరెపల్లె, పెగడపల్లి, గంగారం, లక్ష్మీపురం, పెద్దంపేట, కాల్వశ్రీరాంపూర్‌, ఊశన్నపల్లె గ్రామాల్లో పర్యటించారు. ఆయిల్‌పామ్‌, కూరగాయల తోటలు పరిశీలించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబ డి, ఎక్కువ ఆదాయం ఇచ్చే ఆయిల్‌పామ్‌ సా గు చేయాలని రైతులకు సూచించారు. కూరగాయల సాగుతో రోజువారీగా ఆదాయం వస్తుందని అన్నారు. పెగడపల్లి ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

యూనిఫామ్స్‌పై ప్రచారం

రామగుండం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందించే యూనిఫామ్స్‌ నమూనాపై బడిబాటలో ఉపాధ్యాయులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. తమ బడిలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రుచికరమైన మధ్యాహ్న భోజనం, నోటుపుస్తకాలు, యూనిఫామ్స్‌ అందిస్తోందని చెబుతున్నారు. ఆధునిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్‌ ల్యాబ్‌, అర్హులైన ఉపాఽ ద్యాయులతో నాణ్యమైన విద్యాబోధన అందిస్తోందని వారు వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటీల్లో రిజర్వేషన్‌ సౌకర్యంతో సీట్లు లభిస్తుందని చెబుతున్నారు.

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

గోదావరిఖని: ఫొటో, వీడియో గ్రాఫర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, పీపీఐఎన్‌, హైదరాబాద్‌ చేపట్టిన ఒకరోజు ప్రీఫొటో వర్క్‌షాప్‌ పోస్టర్‌ను రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ శనివారం ఆవిష్కరించారు. ఈనెల 14న అడ్డగుంటపల్లి ఎస్‌ఎస్‌ బ్యాంకెట్‌ హాల్‌ వర్క్‌షాప్‌ నిర్వహిస్తారన్నారు. మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతిపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు నెలికంటి రాము, ముస్తఫా, గట్ల రమేశ్‌, అసోసియేషన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు రెడ్డి భాస్కర్‌, శనిగరపు మల్లేశ్‌, బండారి ప్రసాద్‌, రామగిరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల వేతనం విడుదల

పెద్దపల్లి: జిల్లాలోని 1,051 మంది పంచాయతీ పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.94,97,755 విడుదల చేసినట్లు డీపీవో నరేందర్‌ తెలిపారు. గ్రామపంచాయతీ అకౌంట్లో టీఎస్‌ బీ పాస్‌, ఎస్‌టీవో నుంచి వేతనా లు పొందవచ్చని వివరించారు. మొత్తం మూ డు నెలలకు సంబంధించి రూ.94,97,755 ఖాతాలో జమైనట్లు ఆయన వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement