కోల్‌సిటీ: గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్)కు చెందిన పలువురు మెడికోలు ఫుడ్‌పాయిజన్‌కు గురయ్యారు. వీరు శనివారం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఒకేసారి పలువురు విద్యార్థులు ఆస్పత్రి కి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీరితోపాటు ఇద్దరు అధ్యాపకులు కూడా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వివిధ రాష్ట్రాలకు చెందిన 11మంది మెడికోలు(ఇందులో ఆడవారు కూడా ఉ న్నారు) శుక్రవారం రాత్రి తమ సహ విద్యార్థి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కవితా థియేటర్ సమీపంలోని ఓ రెస్టారెంట్ నుంచి ఆహారం తెప్పించుకున్నారు. ఆ తర్వాత త మ హాస్టల్‌లో తిన్నారు. శనివారం ఉదయం వాంతులు, విరోచనాలు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే జీజీహెచ్‌కు తరలించారు.
ఇద్దరు ప్రొఫెసర్లకు కూడా..
ఇదే రెస్టారెంట్‌లో భోజనం చేసిన సిమ్స్‌లోని ఇద్దరు ప్రొఫెసర్లు కూడా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో సిమ్స్ యాజమాన్యం, జీజీహెచ్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యా రు. మెడికల్ కాలేజీలో ఈ సంఘటనతో విద్యా ర్థులు కూడా ఆందోళనకు గురయ్యారు.
నమూనాలు సేకరణ..
ఫుడ్ పాయిజన్‌పై గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ) ఆర్‌ఎంవో కృపాభాయి, సీఎంవో అప్పారావు వెంటనే స్పందించారు. ఆస్పత్రికి చే రుకొని బాధితులను పరామర్శించి వైద్యసేవలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృపాభా యి మాట్లాడుతూ.. చికిత్స అనంతరం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా మారడంతో హాస్టల్‌కు పంపించామన్నారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించామని, బాధితుల నుంచి నమూనాలు సే కరించామని తెలిపారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అందరూ కూడా బయట ఆహారం తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, హాస్టల్ మెస్ ఆహారంతో కాకుండా, బయట రెస్టారెంట్ నుంచి తెప్పించుకున్న ఆహారంతోనే ఫుడ్‌పాయిజన్ అయ్యిందని, మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్‌కు సంబంధం లేదని మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ హాస్టల్ మెస్ కమిటీ ప్రకటించింది. మ రోవైపు.. ఫుడ్ పాయిజన్ సమాచారం అందుకున్న ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వెంటనే స్పందించారు.
రెస్టారెంట్ ఆహారం తిని మెడికోలకు అస్వస్థత
బాధితుల్లో 11 మంది వైద్యవిద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లు


