గోదావరిఖని: సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డ్ యథావిధిగా నిర్వహించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక్‌హరి డిమాండ్ చేశారు. స్థానిక విఠల్‌నగర్ హమాన్ టెంపుల్ నుంచి ఆర్జీ–వన్ జీఎం ఆఫీస్ వరకు శనివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే ధర్నా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి కార్మిక పిల్లలకు ఉద్యోగాలు కల్పించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 26 నెల లుగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. 24 నెలల సర్వీసు నిబంధనతో వేలా ది మంది కార్మికులు కారుణ్య నియామకాలకు దూ రమయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కారుణ్య నియామకాల పోరాటాలకు సిద్ధమని ఆయన తెలిపారు. అయితే, ధర్నా సమాచారం అందుకున్న పోలీసులు రామగుండంలోని కౌశిక్ హరి ఇంటిని చుట్టుముట్టారు. ఆయనను గృహ నిర్భందం చేశారు. కొందరు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. బీఆర్‌ఎస్ నాయకులు కౌశిక్ లత, కార్పొరేటర్లు మందల కిషన్‌రెడ్డి, నిమ్మ రాజుల, మాజీ కార్పొరేటర్ కాల్వ శ్రీనివాస్, జనగామ కవితాసరోజిని, రమ్యయాదవ్, పొన్నం రాజమణి, బసవరాజు గంగరాజు, ఎంచర్ల మహేశ్, బత్తిని సతీశ్, మాదాసి శ్రీనివాస్, నాగరాజు, గాలెంకి ప్రసాద్, పున్నం శశికుమార్ పాల్గొన్నారు.
పోలీసుల నుంచి తప్పించుకొని ధర్నాకు..
రామగుండం: బీఆర్‌ఎస్ నేత కౌశిక హరి ఆధ్వర్యంలో సింగరేణి ఆర్జీ–1 జీఎం ఆఫీసు ఎదుట చేపట్టిన ధర్నాను భగ్నం చేసేందుకు సీఐ కృష్ణకుమార్, ఎ స్సైలు సంధ్యారాణి, వెంకటస్వామి ఉదయమే కౌ శిక హరి, ఆయన సతీమణి కౌషిక లతను గృహ ని ర్బంధం చేశారు. పోలీసు కళ్లుగప్పిన హరి, లత గోదావరిఖని చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు.
ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట ధర్నా


