జ్యోతినగర్: నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి కోరారు. ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డులో చేపట్టిన రహదారి లెవల్ పనులను కార్పొరేటర్ కొలని కవితారెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ సహకారంతో సుందర రామగుండంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కాలనీ సుందరీకరణే లక్ష్యం
యైటింక్లయిన్‌కాలనీ: కాలనీ సుందరీకరణ లక్ష్యంగా ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పని చేస్తు న్నారని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. స్థానిక 14, 15, 16, 17, 18, 19, 20 డివిజన్లలో ఆర్జీ–2 సింగరేణి సివిల్ డిపార్ట్‌మెంట్ అధికారులు, నాయకులతో కలిసి శనివారం మేయర్ పర్యటించారు. ఓపెన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారెల్లి రాజిరెడ్డి, గుండేటి రాజేశ్, శంకర్ నాయక్, అను ము స్వరూప, దేవనపల్లి చక్రపాణి, బుర్ర ముత్యాలుగౌడ్, సింగరేణి అధికారులు బాలరాజు, సోని యా, అఖిల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
రామగుండం మేయర్ మహంకాళి స్వామి


