‘కరువు పని’కి కలిసి కట్టుగా.. | - | Sakshi
Sakshi News home page

‘కరువు పని’కి కలిసి కట్టుగా..

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

ఉపాధిహామీ పథకం గ్రామీణ పేదలకు వందరోజుల పని కల్పిస్తోంది. వలసలను నివారించి పేదలకు ఉపాధి కల్పించాలనేది కేంద్రప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే కాలువలు, నీటిచెలిమల తవ్వకం, మొక్కలు నాటడం, రోడ్ల నిర్మాణం.. ఇలాంటి పనులు గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు ప్రతీఊరులో కొనసాగుతున్నాయి. ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామ శివారు గుట్టలపై పనులు ముగించుకొని ఇంటిబాట పట్టిన వందలాది మంది ఉపాధి కూలీలు ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement