గోదావరిఖని: పనికిరాని బండను బొగ్గు అని చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను నాశనం చేస్తోందని మాజీమంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొ ప్పుల ఈశ్వర్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన బొగ్గు నిల్వలను పరిశీలించారు. గనులపై 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందని, జీడీకే–5 ఓసీపీలో 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ చేసి ఉందని, ప్రస్తుతం 3 లక్షల 60 వేల టన్నులు అని చెబుతున్నారని, కానీ, 50 వేల మెట్రిక్ టన్నులు కూడా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. దీనిపై సీబీఐ ఎంకై ్వరీ జరుపాలని, లేని బొగ్గును ఎలా సృష్టిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ సింగరేణి సదస్సు ఎఫెక్ట్‌తో శనివారం కారుణ్యనియామక పత్రాలను డిప్యూటీ సీఎం అందజేస్తున్నారని అన్నారు. నాయకులు నూనె కొమురయ్య, పర్లపెల్లి రవి తదితరులు ఉన్నారు.
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు : ఠాకూర్
జ్యోతినగర్: ‘అమ్మా.. రేపు మీ ఇంటికి వస్తా’ అని చెప్పి మాట నిలబెట్టుకున్న రామ గుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూ ర్ మక్కాన్‌సింగ్. శుక్రవారం 33వ డివిజన్‌లో ఎమ్మెల్యే ప ర్యటించారు. నిన్న(గురువారం) ఎమ్మెల్యేను కలిసి తన నివాస పరిస్థితిని వివరించిన ఓ వృద్ధ మహిళకు.. ‘అ మ్మా.. రేపు మీ ఇంటికి వస్తా’ అని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. మాట ప్రకారం శుక్రవారం ఆమె ఇంటికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని అన్నారు.
ప్రభావిత గ్రామాలను దత్తత తీసుకోవాలి
ఫెర్టిలైజర్‌సిటీ: ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రభావిత గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చే యాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ కోరారు. 21వ డివిజన్ వీర్లపల్లిలో మేయర్ మహంకాళి స్వామి, అధికారులతోకలిసి ఆయన వార్డు సందర్శన చేపట్టారు. ప్రభావిత గ్రామాలైన లక్ష్మీపురం, ఎల్కలపల్లిగేట్, చైతన్యపురికాలనీ, విఠల్‌నగర్‌ను దత్తత తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, కార్పొరేటర్ కందుల స్వరూప, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య పాల్గొన్నారు.
బాలికల హాస్టల్ ప్రారంభించాలి : ఎస్‌ఎఫ్‌ఐ
మంథని: పట్టణంలోని ఎస్సీ బాలికల(ఎ స్‌ఎంహెచ్) హాస్టల్‌ను ఇక్కడే పునః ప్రా రంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ డిమాండ్ చేశారు. ‘వసతి గృహాల తరలింపు.. మంథని విద్యార్థుల భ విష్యత్’ అంశంపై ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు బందెల రాజ్‌కుమార్ అ ధ్యక్షతన శుక్రవారం పట్టణంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సందీప్ మాట్లాడుతూ, పోరాడి తెచ్చుకున్న ఎస్‌ఎంహెచ్ హాస్టళ్లను మూసివేసి దిశగా అధికారులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బూడిద గణేశ్, గొర్రెంకల సురేశ్, ఎల్పుల సురేశ్, రాపల్లి తిరుపతి, బూడిద తిరుపతి, బెజ్జంకి దిగంబర్ పాల్గొన్నారు.


