కొరాపుట్: కొరాపుట్ జిల్లాలోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. సరిహద్దు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకి చెందిన ఏనుగులు ఒడిశాలోని కొరాపుట్ జిల్లా కొఠియా గ్రామ పంచాయతీ నేరడి వలసకి తరలి వచ్చాయి. అకస్మాత్తుగా ఏనుగుల గుంపుని చూసిన గిరిజనులు భయ బ్రాంతులకు గురయ్యారు. కొఠియా ప్రధాన రహదారిపై ఈ ఏనుగులు యథేచ్ఛగా సంచరించాయి. దాంతో కొఠియా గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగుల గుంపు సమీపానికి చేరుకున్నారు. వాటి కదలికలు పర్యవేక్షిస్తున్నాయి. ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిచి పోయాయి. కొరాపుట్ జిల్లా అధికార యంత్రాంగం ఏనుగుల వల్ల గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి రెవెన్యూ యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది.


