రుద్రూర్: ప్రజా సమస్యల పరిష్కారంలో గ్రామ పంచాయతీల పాత్ర కీలకమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పొతంగల్ మండలంలోని తిర్మలపూర్, పీఎస్‌ఆర్ నగర్ గ్రామాల్లో శనివారం గ్రామ పంచాయతీ నూతన భవనాల నిర్మాణానికి ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ప్రభు త్వ సేవలు అందుబాటులో ఉండేలా పంచాయతీ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజు. తిర్మాలపూర్, పీఎస్‌ఆర్ నగర్ సర్పంచ్‌లు సైదవ్వ, రాంబాయి, ఏఎంసీ చైర్మన్ హన్మంతు, మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్, మండల, గ్రామస్థాయి ప్రజాప్ర తినిధులు, అధికారులు పాల్గొన్నారు.


