టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

● తపస్‌ జిల్లా అధ్యక్షుడు శశిరాజ్‌

● తపస్‌ జిల్లా అధ్యక్షుడు శశిరాజ్‌

నిర్మల్‌ రూరల్‌: ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని తపస్‌ జిల్లా అధ్యక్షుడు శశిరాజ్‌ డిమాండ్‌ చేశారు. ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు ఎన్‌సీటీఈ నిబంధనలకు అనుగుణంగా 2025లో సుప్రీం కోర్ట్‌ తీర్పు వెలువరించిందని, దీంతో ఆందోళన చెందిన ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు 65 రివ్యూ పిటిషన్లు వేశారన్నారు. నిబంధనల ఆధారంగానే సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్లు కొట్టివేసిందని తెలిపారు. 2028 ఆగస్టు 31 వరకు గడువు పెంచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులకు టెట్‌ అర్హత లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వాన్ని ఒప్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇందులో సుదర్శన్‌, జిల్లా బాధ్యులు కీర్తి సాయన్న, వాసుదేవరెడ్డి, అనుముల అరుణ్‌, అశ్విన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement