ఆరుతడి పంటలు వేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు వేసుకోవాలి

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

● డీఏవో అంజిప్రసాద్‌

● డీఏవో అంజిప్రసాద్‌

కుంటాల: ఈ వానా కాలంలో రైతులు తక్కువ నీటి వినియోగం ఉన్న ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని డీఏవో అంజిప్రసాద్‌ పేరొన్నారు. మండలంలోని కల్లూరు గ్రామపంచాయతీ ఆవరణలో రైతులకు శనివారం ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించారు. ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలు పొందవచ్చన్నారు. దీని ద్వారా రుణాలు, రాయితీలు రైతులకు సకాలంలో అందుతాయని తెలిపారు. రైతులు కందులు, మినుములు పెసర్లు, నువ్వులు, ఆవాలు వేసుకోవడం మంచిదని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పెంటవార్‌ దశరథ్‌, ఏఈవో లక్ష్మి, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement