లక్ష్మణచాంద మండలంలో శుక్రవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు మండలంలోని ధర్మారం గ్రామంలో మహా పోచమ్మ ఆలయ సమీపంలోని భారీ రావి వృక్షం రెండుగా చీలి ఇలా కూలిపోయింది. ఉదయం కూలిన చెట్టును చూసి గ్రామస్తులు ఆందోళన చెందారు. సుమారు 50 ఏళ్ల మహావృక్షం కూలిపోయిందన్నారు. కొంతకాలంగా వృక్షం కాండానికి పురుగు సోకిందని, ఈ క్రమంలో బలహీనపడి గాలికి విరిగిందని తెలిపారు. పోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులు ఈ చెట్టుకింద సేద తీరేవారని తెలిపారు. – లక్ష్మణచాంద


