కడెం: పన్నెండేళ్ల సుదీర్ఘ పాలనలో ఎక్కడా చిన్న మచ్చ లేకుండా, యావత్ భారత జాతి గర్వంతో తలెత్తుకునేలా చేసిన నాయకుడు నరేంద్ర మోదీ అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామరావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్‌రాథోడ్ అన్నారు. మండలంలోని కొండూకూర్ గ్రామంలో మోదీ 12 ఏళ్ల పాలనపై జిల్లా ప్రతినిధుల సమ్మేళనం శనివారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల విశ్వాసాలను సగర్వంగా చాటిచెప్పిన నాయకుడు మోదీ అన్నారు. చాయ్ వాలా నుంచి దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగి 12 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవ పూర్తిచేసుకున్న కర్మయోగి 2029లో నాలుగోసారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, ఆకుల శ్రీనివాస్, రాజు యాదవ్, యాతాళం చిన్నారెడ్డి, రవీందర్‌రెడ్డి, సత్యం చంద్రకాంత్, కాశవేని శ్రీనివాస్‌యాదవ్, బుర్ర రమేశ్, శారద, అంకం మహేందర్, నల్లా రమేశ్, తాడేవర్ సాయినాథ్, జిల్లాలోని మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.


