ఉల్లంఘనులపై కొరడా | - | Sakshi
Sakshi News home page

ఉల్లంఘనులపై కొరడా

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

భైంసాటౌన్‌: వాహనదారులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఏఎస్పీ సాయికిరణ్‌ హెచ్చరించారు. ప్రత్యేక తనిఖీల్లో భాగంగా పట్టణంలో శనివారం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. మైనర్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, డ్రంకెన్‌డ్రైవ్‌, రిజిస్ట్రేషన్‌, నంబర్‌ ప్లేట్లు లేకుండా వాహనాలను నడపడంవంటి ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 16 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై మైనర్‌ డ్రైవింగ్‌ కేసు, ఇద్దరిపై ట్రిపుల్‌ రైడింగ్‌ కేసు నమోదు చేశారు. నంబర్‌ ప్లేట్‌ లేని తొమ్మిది వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై డ్రంకెన్‌డ్రైవ్‌, 26 మందికి రూ.18,500 స్పాట్‌ చలాన్‌ కేసులు నమోదు చేశారు. కెమెరా చలాన్‌ కేసులు, ఇతర కేసులకు సంబంధించి మొత్తం 54 కేసులు నమోదు చేయగా, రూ.21,355 జరిమానా వసూలు చేసినట్లు సీఐ సాయికుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement