ఖానాపూర్: మండలంలోని పాత ఎల్లాపూర్ జెడ్పీహెచ్‌ఎస్, ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం సర్పంచ్ ఏలేటి ప్రశాంత్‌రెడ్డి తన సొంత నిధులతో వాహన సౌకర్యం కల్పించారు. టాటా ఏస్ వాహనం కొనుగోలు చేశాడు. దూర ప్రాంత విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాత ఎల్లాపూర్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు కూడా ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. సర్పంచ్‌ను గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించారు.


