కుంటాల: గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని డీపీవో శ్రీనివాస్ పేర్కొన్నారు. కుంటాలలో స్టీల్ బ్యాంకును శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలను వివరించారు. చెత్తను సంపదగా మార్చి పంచాయతీకి ఆదాయం సమకూర్చుతున్న కార్యదర్శి రాజబాపును ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కల్లూర్ కేజీబీవీ ని సందర్శించారు. పాఠశాల పరిసరాలను శు భ్రంగా చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ కమల్‌సింగ్, డీఎల్పీవో లక్ష్మణ్, ఎంపీడీవో అల్లాడి వనజ, సర్పంచ్ జక్కుల గజేందర్, ఎంఈవో ముత్యం, కార్యదర్శులు రాజబాపు, సతీశ్, రాజు, గంగప్రసాద్ పాల్గొన్నారు.


