అధికమాసంలో అల్లుళ్లను అత్తగారింటికి ఆహ్వానించి, కొత్త బట్టలు, పిండి వంటలు లేదా తీపి పదార్థాలను రాగి పాత్రలో పెట్టి దానం చేయడం తెలుగువారి సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. వాయినాలు పెట్టి మర్యాదలు చేయడం ద్వారా కుటుంబ బంధాలు బలపడతాయని భావిస్తారు. అధిక జేష్ట మాసం సందర్భంగా నిర్మల్ పట్టణంలోని నారాయణరెడ్డి మార్కెట్‌లో శుక్రవారం అధికమాసం సందడి కనిపించింది. ఇత్తడి, రాగి, స్టీల్ పాత్రలను కొనుగోలు చేసేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో దుకాణాలు కిటకిటలాడాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్


