ఖానాపూర్: ఖానాపూర్ నూతన సబ్ రిజిస్ట్రార్‌గా కిరణ్ తేజావత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు విధులు నిర్వహించిన స్వామిదాస్ బదిలీపై నిర్మల్‌కు వెళ్లారు. ఆయన స్థానంలో ప్రభుత్వం కిరణ్ తేజావత్‌ను నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిరణ్ తేజావత్ మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తానని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన సబ్ రిజిస్ట్రార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


