న్యూస్‌రీల్
జరుగుతున్నవి
లక్ష్యం దాటని తునికాకు
చెన్నూర్ ఫారెస్టు డివిజన్ పరిధిలో ఈ ఏడాది తునికాకు సేకరణ లక్ష్యం దాటలేదు. అటవీశాఖ నిర్దేశించిన లక్ష్యంలో 50 శాతం మాత్రమే సేకరించారు.
భూసేకరణ ప్రాంతం పరిశీలన
బాసర: మండల కేంద్రం రైల్వే స్టేషన్, నవేగావ్ రోడ్ వద్ద ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ ప్రాంతాన్ని భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ రైల్వే, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత సర్వే నంబర్లు, భూ విస్తీర్ణం, ప్రస్తుత భూ పరిస్థితులు, ప్రాజెక్టుకు అవసరమైన భూమి వివరాలను అధికారులు పరిశీలించారు. అనంతరం తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో బాసర తహసీల్దార్ పవన్‌చంద్ర, ఆర్‌ఐ అభిమన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా మిగిలిన మరుగుదొడ్లు. ఇదే పాఠశాలలో ప్రస్తుత డీఈవో భోజన్న చదువుకున్నారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. ఈ పాఠశాలలో 265 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరికీ ఒకే మరుగుదొడ్డి ఉంది.
నిర్మల్ రూరల్: మూడు రోజుల్లోనే ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే జిల్లాలోని అనేక బడుల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, మధ్యాహ్న భోజనషెడ్ల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. దీంతో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. కొన్ని పాఠశాలల్లో నిర్మాణ పనులు మూడేళ్ల క్రితమే ప్రారంభమైనా ఇంకా ముగింపు దశకు చేరలేదు. ఫలితంగా విద్యార్థులు చెట్ల నీడలో చదువుకోవాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజనం వంట కూడా చెట్ల కిందే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కిచెన్ షెడ్లు ఇలా..
235 పాఠశాలలకు కిచెన్ షెడ్లు మంజూరయ్యాయి. వీటిలో కేవలం 5 చోట్ల మాత్రమే పనులు జరుగుతున్నాయి. ఒక్క చోట కూడా నిర్మాణం పూర్తి కాలేదు. మిగిలిన 230 పాఠశాలల్లో పనులు ఇంకా మొదలు కాలేదు. ప్రభుత్వం రూ.2 లక్షలు మంజూరు చేసినా ఆ నిధులు సరిపోవడం లేదని అధికారులు నివేదించారు. కనీసం రూ.3.50 లక్షలు మంజూరు చేయాలని కోరినా ఇంకా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.
అసంపూర్తిగా ‘మన ఊరు – మన బడి’ పనులు
‘మన ఊరు – మన బడి’ పథకం కింద 260 పాఠశాలలకు వివిధ నిర్మాణాల కోసం నిధులు మంజూ రు అయ్యాయి. అయితే ఈ పనులన్నీ ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. నిర్మించిన వాటికి కూడా నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.
ఫిట్‘లెస్’ బస్సులు!
జిల్లా వివరాలు...
పనులు మంజూరైనవి పూర్తయినవి పనులు
మరుగుదొడ్లు 272 16 40 కిచెన్ షెడ్లు 235 0 05 ప్రహరీలు 261 10 70
బుల్లెట్టు బండెక్కి.. వాగులు వంకలు దాటి..


