సారంగపూర్: అడవులను రక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని అటవీ శాఖ నిర్మల్ మండల అధికారి షేక్ ఆదం నాగినీభాను అన్నారు. చించోలి(బి)అర్బన్ పార్కులో గురువారం ప్రజాపాలన పల్లె ప్రగతిలో భాగంగా వన మహోత్సవం నిర్వహించా రు. మొక్కలు నాటారు. అనంతరం స్థానికులతో కలిసి పార్కును సందర్శించారు. ఈసందర్భంగా అటవీ అధికారి మాట్లాడుతూ ప్రకృతిలో అన్నింటికన్నా ప్రధానమైనది జీవవైవిధ్యమన్నారు. దానిని సక్రమంగా ఉంచాలంటే అడవులను సంరక్షించుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి రక్షించాలని తెలిపారు. ఎఫ్‌ఆర్‌వో రామకృష్ణారావు, డీఆర్‌వో నజీర్‌ఖాన్, అటవీశాఖ సిబ్బంది, పార్కు సిబ్బంది పాల్గొన్నారు.


