ముగ్గురు తోడబుట్టిన అన్నదమ్ములు.. హైదరాబాద్‌లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఇద్దరికి వివాహాలు అయ్యాయి. రెండో కొడుకు రాంచందర్ తన పిల్లలకు బాసర జ్ఞానసరస్వతీదేవి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించాలనుకున్నాడు. తండ్రి నాగభూషణ్ అన్న చంద్రశేఖర్, తమ్ముడు మల్లేశ్‌కుమార్‌ను తీసుకుని మంగళవారం మధ్యాహ్నం బాసరకు వచ్చాడు. అయితే వీరి ఐక్యతను చూసి విధికి కన్నుకుట్టింది. అమ్మవారి దర్శనానికి ముందు గోదావరిలో పుణ్యస్నానానికి వెళ్లారు. అదే వారికి చివరి స్నానంగా మారింది. ముగ్గురు అన్నదమ్ములనూ మృత్యువు కబళించింది. ఉదయం సంతోషంగా బాసరకు వచ్చిన కుటుంబం గోదావరంత దుఃఖంతో అన్నదములను విగత జీవులుగా తీసుకుని హైదరాబాద్ వెళ్లింది. – భైంసా/బాసర


