ఫోన్‌ పోతే ఆందోళన వద్దు | - | Sakshi
Sakshi News home page

ఫోన్‌ పోతే ఆందోళన వద్దు

Jun 10 2026 1:37 AM | Updated on Jun 10 2026 1:37 AM

నిర్మల్‌ టౌన్‌: మొబైల్‌ ఫోన్‌ పొతే ఆందోళన వద్దని, పోలీస్‌ స్టేషన్‌లో లేదా మీ సే వ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. https://www.ceir.gov.in/ వెబ్‌ పోర్టల్‌ ద్వారా ఫోన్‌ ఆచూకీ తెలుసుకోవడం చాలా సులభమని తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పలువురు పోగొట్టుకున్న రూ.12.96 లక్షల విలువైన 108 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేశామన్నారు. వాటిని జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం బాధితులకు అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్లు కొనే ముందు సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌లో ఆ ఫోన్‌ ఐఎంఈఐ నంబర్‌ చెక్‌ చేసుకోవాలని సూచించారు. చోరీ అయిన ఫోన్లు గుర్తించేందుకు పోలీస్‌ శాఖ ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తుందని తెలిపారు. టెలికాం మంత్రిత్వ శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన సెంట్రల్‌ ఎక్విప్మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (సీఈఐఆర్‌) అప్లికేషన్‌ పోయిన ఫోన్‌ను వెతికి పెట్టడానికి ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ అప్లికేష న్‌ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 2,250 ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, వివిధ పోలీస్‌ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement