ప్రమాదాల నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు చర్యలు

Jun 10 2026 1:37 AM | Updated on Jun 10 2026 1:37 AM

లక్ష్మణచాంద: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు నిర్మల్‌ అడిషనల్‌ ఎస్పీ ఉపేంద్రారెడ్డి పేర్కొన్నారు. సోన్‌ మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద 44 నంబర్‌ జాతీయ రహదారిని మంగళవారం ఆర్‌అండ్‌బీ డీఈ బీమ్‌ సింగ్‌తో కలిసి పరిశీలించారు. సోన్‌ బస్టాండ్‌ వద్ద సోన్‌ వాసులు, లక్ష్మణచాంద మండల వాసులు నిజామాబాద్‌, హైదరాబాద్‌ వంటి దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇక్కడే దిగుతారు. అప్రోచ్‌ రోడ్డు లేకపోవడంతో రోడ్డును దాటేక్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రమాదాల నివారణ చర్యలపై ఆర్‌అండ్‌బీ అధికారులతో చర్చించారు. సోన్‌ మండలం మాదాపూర్‌ ఐబీ వద్ద సెంట్రల్‌ లైటింగ్‌ త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అప్రోచ్‌ రోడ్డు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో ఆర్‌అండ్‌బీ డీఈ భీమ్‌సింగ్‌, ఎస్సై గోపి, ఉప సర్పంచ్‌ దాసరి రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement