పన్ను నొప్పికి ప్రైవేటుకే! | - | Sakshi
Sakshi News home page

పన్ను నొప్పికి ప్రైవేటుకే!

Jun 10 2026 1:37 AM | Updated on Jun 10 2026 1:37 AM

● పెద్దాస్పత్రిలో వేధిస్తున్న సిబ్బంది, పరికరాల కొరత ● సరైన సేవలు అందక బాధితుల ఇబ్బంది

తాజాగా డెంటిస్టు బదిలీ..

నిర్మల్‌చైన్‌గేట్‌: దంత సమస్యలు త్వరగా నయం కావు. సకాలంలో సరైన చికిత్స చేయించుకోకపోతే ఇతర ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతారు. అయితే జిల్లాలో దంత సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్దాస్పత్రి మెరుగైన వైద్యం అందడం లేదు. డెంటల్‌ విభాగం పరికరాలు లేక, నిపుణులైన డాక్టర్లు లేక ఆస్పత్రికి వచ్చినవారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. నొప్పి అధికంగా ఉన్నవారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారు.

ఓపీ సేవలకే పరిమితం..

జిల్లా పెద్దాస్పత్రి దంత విభాగంలో రూట్‌ కెనాల్‌ ట్రీట్‌మెంట్‌, డీప్‌ క్లీనింగ్‌, దంతాల ఫిల్లింగ్‌, కాస్మెటిక్‌ డెంటిస్ట్రీ వంటి అన్ని ముఖ్యమైన చికిత్సలు అందించాల్సి ఉన్నా, ప్రస్తుతం ఔట్‌పేషెంట్‌(ఓపీ) సేవలతో సరిపెడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఒక్క డాక్టర్‌ మాత్రమే డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. ఆమె కూడా ఇటీవల ఖానాపూర్‌కు బదిలీ అయ్యారు. ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి.

పరికరాలు లేక సేవలు అందక..

దంత చికిత్సకు అత్యవసరమైన డెంటల్‌ చైర్‌, డిజిటల్‌ ఎక్స్‌–రే, ఓరల్‌ కెమెరా, అల్ట్రాసోనిక్‌ స్కేలర్‌, పాలిషింగ్‌ బ్రష్‌

వంటి పరికరాలు కూడా పెద్దాస్పత్రిలో లేవు. ఉన్న డెంటల్‌ చైర్‌ కూడా పాడైపోయింది. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులకు నొప్పి నివారణ మాత్రలు రాసి పంపిస్తున్నారు. సదుపాయాలు లేక రోజుకు 10 నుంచి 15 మంది రోగులు మాత్రమే సాధారణ చికిత్స పొందుతున్నారు. పరికరాలు సమకూర్చి, ఎండీ స్థాయి నిపుణులను నియమించి దంత విభాగాన్ని బలోపేతం చేయాలని రోగులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

బదిలీపై రావచ్చు..

జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో ఇప్పటి వరకు టీవీవీపీకి చెందిన వైద్యురాలితో డెంటల్‌ ట్రీట్‌మెంట్‌ అందించాం. సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. జనరల్‌ ఆస్పత్రికి కూడా సాధారణ బదిలీల్లో డాక్టర్‌ వచ్చే అవకాశం ఉంది. – సీవీ.శారద,

మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

ఐదు నెలలగా జీజీహెచ్‌లో

నమోదైన డెంటల్‌ ఓపీ..

జనవరి 215

ఫిబ్రవరి 164

మార్చి 158

ఏప్రిల్‌ 181

మే 150

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement