రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో వాతావరణం చల్లబడింది. సోమవారం మృగశిరకార్తె రోజే తొలకరి పలకరించింది. జిల్లా అంతటా జల్లులు కురిశాయి. మంగళవారం వేకువజామున కుంటాల, కుభీర్, నర్సాపూర్(జి), దిలావర్‌పూర్, సారంగాపూర్ మండలాల్లో మోస్తరు వాన కురిసింది. దీంతో ఉదయం రైతులు సాగుబాట పట్టారు. కుంటాల, నాగళ్లతో దుక్కులు దున్నుతూ, విత్తనాలు వేస్తూ, ఎరువులు చల్లుతూ బిజీ అయ్యారు. కొందరు రైతులు చేలను సిద్ధం చేసే పనులు మొదలు పెట్టారు. మరికొందరు ఎరువులు, విత్తనాల కోసం దుకాణాల బాటపట్టారు. కుభీర్ మండలంలో 20–20, డీఏపీ ఎరువులు దొరకకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. కొన్ని షాపుల్లో అధిక ధరకు విక్రయించారని రైతులు తెలిపారు. కొందరు రైతులు ఎరువుల కోసం పొరుగున ఉన్న మహారాష్ట్రకు వెళ్లారు. – సాక్షి ఫోటోగ్రాఫర్ నిర్మల్/కుంటాల/కుభీర్


